8వ తరగతి – సోషల్ స్టడీస్ 01. పటాల అధ్యయనం – విశ్లేషణ- రివిజన్ మెటీరియల్ ,ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్

 • చిత్రం వలె పటం నిజమైన అంశాలను చూపించదు.ముఖ్యమైన అంశాలని భావించే వాటిని మాత్రమే చూపించటానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు ఉపయోగిస్తారు.
  • ఉదాహరణకు:వర్షపాతం ,నేల రకాలు ,జనాభా,పంటలు,ప్రజలు మాట్లాడే భాష ,మార్కెట్లు మొదలైనవి ఉండవచ్చు
మహాభారతం లో సూచించినటు వంటి చుట్టూ నీరు అవరించబడి వున్న ప్రపంచం
PIC 1.1 .మహాభారతం లో సూచించినటు వంటి చుట్టూ నీరు అవరించబడి వున్న ప్రపంచం

వివిధ కాలాల్లో పటాలు: పటాలకు ఎంతో చరిత్ర ఉంది.చరిత్ర పూర్వ కాలం నుంచి ప్రజలు భూమి ,నదులు,సముద్రాలు,ఆకాశం మొదలగు వాటితో కూడియున్న అంతరిక్షం గురించి ఎన్నో ఉహాగానాలు చేసారు. తరచుగా ఈ ఉహలకు దృశ్యరూపం ఇవ్వబడింది.

 • చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్(PIC 1) మధ్యప్రదేశ్ లోని జవోరా నందు లభించింది
PIC 1.2 .ఏడు ద్వీపాలను సూచిస్తున్న ప్రాచీన భారతీయ పటం
 • భూమి ఏడు సముద్రాలతో చుట్టబడిన ఏడు ద్వీపాలను(PIC 2) కలిగి ఉండి ,కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి వృత్తాకారంలో ఉంది.భారతదేశం జంబూద్వీపం నందు కలదు .
 • వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించటం లో ఆక్షాంశ ,రేఖాంశాల అవగాహన ఉపయోగపడుతుంది .
 • మొఘలుల కాలంలో భారతీయులు పటాల తయారీలో మధ్య ఆసియా వారి పద్దతులను అనుసరించారు.
 • 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫాహన్ జాన్పుర్లో ఒక అట్లాస్ తయారుచేసినట్లు చెబుతారు.అతను తన పటాలలో ఆక్షాంశ ,రేఖాంశాలను ఉపయోగించాడు.
 • ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న పురాతనమైన పటాలు నాలుగు వేల సంవత్సరాలనాటివి.
 • వీటిని సుమేరియన్లు (ప్రస్తుత ఇరాక్ ) తాయారు చేసారు.
 • వీటిని మట్టి పలకల మీద చేసారు.
 • సుమేరియన్ల దేవాలయలయాలకు చాలా భూములు ఉండేవి.ఈ భూముల నుంచి ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాల రూపంలో భద్రపరిచేవారు.
బాబిలోయన్ మట్టి పలక
 • మొదట కొన్ని ప్రపంచ పటాలను బాబిలోయన్లు తయారుచేశారు .
 • .పక్కన చిత్రం(1.4 )లో బాబిలోయన్ల మట్టి పలక చిత్రం చూడండి.ప్రపంచం గుండ్రటి ల్లెం మాదిరి ఉందని వారు ఉహించుకున్నారు.
 • లోపలి వలయం బయట ‘చేదు నది ‘ లేదా ఉప్పునీటి సముద్రం ఉంది,దాంట్లో త్రికోణాకారంలో ఏడు దీవులు ఉన్నాయి.
 • బాబిలోయన్లు వాలే హేకేటియస్,హేరోటోడస్ కూడా భూమి గుండ్రంగా ఉందని ,దాని చుట్టూ సముద్రం(1.5) ఉందని భావించారు.
 • పై పటంలో ప్రపంచాన్ని యూరోప్ ,లిబియా (ఆఫ్రికా),ఆసియా అని మూడు ఖండాలుగా విభజించారు.వీటిని మద్యధరా సముద్రం వేరు చేస్తుంది.
 • గ్రీకులు అక్షాంశాలు ,రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తాయారు చేయటానికి ప్రయత్నించారు.
 • గ్రీకులు ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను గుర్తించి వాటిని కలుపుతూ ఉత్తరం నుంచి దక్షిణానికి ఇక గీత గీశారు.ఈ గీత ను మెరిడియన్ లేదా రేఖాంశం అంటారు.
 • మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను గీయటానికి ప్రయత్నించారు.
 • ఈ గీతాల ఆధారంగా పటాల మీద ప్రదేశాలను గుర్తించటంతో యాత్రికులకు ,నావికులకు తమ గమ్యస్థానాన్ని బట్టి దిశను మార్చుకుంటూ అక్కడికి చేరుకోవటం తేలికైంది.
 • పటాల తయారు చేయటానికి అరబ్బు పండుతులు ,నావికులు టాలమీ పుస్తకాలను ఉపయోగించుకున్నారు.
 • మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబ్బులు మూసివేశారు.భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనటానికి పశ్చిమ యూరప్ వ్యాపారస్తులు బయలుదేరారు.
  • ఆ విధంగా కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు.
  • ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చిన వాస్కోడిగామా భారతదేశం చేరుకున్నాడు.
  • భూమి బల్లపరుపుగా లేదని ,బంతి మాదిరి గోళమని నిరూపించటానికి ఇవికూడా తోడ్పడ్డాయి.
 • ప్రక్షేపనం:ఖండాల పరిమాణం ,దూరాలలో వక్రీకరణాలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం ,దిశలు సరిగా చూపించే విధానాన్ని మేర్కేటర్ రూపొందించాడు.
 • బ్రిటిష్ పాలకులు దేశం అంతటినీ సర్వేక్షణ చేసి పటాలు తయారు చేయటానికి “భారత సర్వేక్షణ” శాఖ(Survey Of India)ను ఏర్పాటు చేసారు.దీనికి జేమ్స్ రన్నెల్ ను “సర్వేయర్ జనరల్ “గా నియమించారు.
 • ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను సా.శ.1802 లో విలియం లాంబ్టన్ ఆరభించాడు .
 • దక్షిణంలో చెన్నై దగ్గర మొదలుపెట్టి ఉత్తరాదిన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తును నిర్ధారించాడు.ఈ సర్వేక్షణను సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశాడు.
 • ఈ సర్వేక్షణ ఆధారంగానె ఎవరెస్ట్ ప్రపంచంలో కెల్లా ఎత్తయినదని నిరూపితమైనది .
 • అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు.

కొన్ని ముఖ్యమైన అంశాలు

8వ తరగతి - సోషల్ స్టడీస్ 01. పటాల అధ్యయనం – విశ్లేషణ

రివిజన్ టెస్ట్

Q:1)ప్రపంచంలో ప్రప్రధమంగా పటాలను తయారు చేసిన వారు ఎవరు ?

A:) బాబిలోయన్లు

B:) సుమేరియన్లు

C:) యూరోపియన్లు

D:) చైనీయులు

Q:2)డెహ్రాడూన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి ఏ దిక్కున ఉంది ?

A:) తూర్పు దిక్కున

B:) దక్షిణ దిక్కున

C:) పడమర దిక్కున

D:) ఉత్తర దిక్కున

Q:3)కింది వాటిలో ,సముద్ర మట్టం నుంచి ఎక్కువ ఎత్తులో ఉన్న పట్టణం ఏది ?

A:) కాకినాడ

B:) విశాఖపట్నం

C:) చిత్తూరు

D:) మచిలీపట్నం

Q:4)భారతదేశ పటంలో హిమాలయ పర్వతాలను ఏ రంగుతో సూచిస్తారు ?

A:) మట్టి రంగు

B:) ముదురు నీలం

C:) ఆకుపచ్చ

D:) ముదురు ఉదా

Q:5)ఒక పటంలో PS,RS అని ఇవ్వబడింది ,అయితే PS,RS లు  వేటిని తెలియజేస్తాయి  ?

 A:) పోలింగ్ స్టేషన్ ,రైల్వే క్రాసింగ్

B:) పోలీస్ స్టేషన్ ,రైల్వే  స్టేషన్

C:) పోలింగ్ స్టేషన్,రైల్వే  స్టేషన్

D:) పోలీస్ స్టేషన్ ,రైల్వే  స్టేషన్ క్రాసింగ్

Q:6)కాంటూరు రేఖలు (ఇసోలైన్స్ )అంటే ?

 A:) సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నిటిని కలిపేది 

B:) సముద్ర మట్టం నుంచి ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నిటిని కలిపేది.

C:) సముద్ర మట్టం నుంచి లోతుగా  ఉన్న ప్రదేశాలన్నిటిని కలిపేది

D:) సముద్ర మట్టం నుంచి ఎత్తు తక్కువగా   ఉన్న ప్రదేశాలన్నిటిని కలిపేది

Q:7)భూమి వాలు ఎలా  ఉన్నప్పుడు ,ఒక పటంలో రెండు కాంటూరు రేఖలు దగ్గర,దగ్గరగా ఉంటాయి  ?

 A:) భూమి వాలు ఎత్తుగా ఉన్నప్పుడు

B:) భూమి వాలు ఎత్తు తక్కువగా  ఉన్నప్పుడు

C:) భూమి వాలు లోతుగా  ఉన్నప్పుడు

D:) భూమి వాలు సమతలంగా  ఉన్నప్పుడు

Q:8)కింది వాటిలో పటాల లోని ప్రస్తుతం బాగా ఉపయోగపడుతూ ,పూర్వం ఉపయోగం కానీ అంశం ?

 A:)దేశాలను గుర్తించటం 

B:)వర్తక సంఘాలు ఏర్పాటు చేయటం 

C:) ఒక ప్రాంతంలో ఉన్న వనరులను గుర్తించటం

D:) వలసలను ఏర్పాటు చేయటం

Q:9)కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం ?

 A:) ఒడిశా

B:) కర్ణాటక

C:) తమిళనాడు

D:) ఝార్ఖండ్

Q:10)తెలంగాణా రాష్ట్రంతో సరిహద్దు పంచుకొని ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా ఏది ?

 A:) కర్నూలు

B:) ప్రకాశం

C:) గుంటూరు

D:) అనంతపురం

Q:11)ఉత్తరం -తూర్పు దిక్కుల మధ్య ఉన్న మూల ?

 A:) ఆగ్నేయం

B:) నైరుతి

C:) వాయువ్యం

D:) ఈశాన్యం

Q:12)మొదటి ప్రపంచ  పటాలను తయారు చేసిన వారు ఎవరు ?

A:) బాబిలోయన్లు

B:) సుమేరియన్లు

C:) యూరోపియన్లు

D:) చైనీయులు

Q:13)యూరోప్ ,లిబ్యా ,ఆసియా ఖండాలను ఏ సముద్రం వేరు చేస్తుంది ?

 A:) బే ఆఫ్ బెంగాల్

B:) తెల్ల సముద్రము

C:) మధ్యదర సముద్రం

D:) అరేబియన్ సముద్రము

Q:14)ఒక వస్త్ర వ్యాపారి శ్రీకాకుళం నుంచి అనంతపురం ,అక్కడి నుంచి నెల్లూరు వెళ్ళాడు.అయితే అతను ప్రయాణించిన మూల మరియు దిక్కు ఏది ? 

 A:) నైరుతి ,తూర్పు

B:) వాయువ్యం ,తూర్పు

C:) నైరుతి ,ఉత్తరం

D:) వాయువ్యం ,దక్షిణం

Q:15)ప్రస్తుతం ప్రపంచ పటాల తయారికి ఆధారమైన ప్రక్షేపనం ?

 A:) అల్ ఇద్రిసి 

B:) అనాక్సిమాండర్

C:) మేర్కేటర్

D:) టాలమీ

ఆన్సర్ కీ

1.B2.D3.C
4.D5.B6.A
7.A8.C9.D
10.D11.D12.A
13.C14.A15.B

మీరు మొదటి పాఠం ను పుర్తిచేసినందుకు దన్యవాదములు .రెండో పాఠం చదవటానికి కింది లింక్ క్లిక్ చేయండి.

Leave a Reply