‘CORONTINE’ పేరుతో మొబైల్ యాప్ ను అభివృద్ధి చేసింది ఎవరు,దాని వల్ల కలిగే ప్రయోజనాలు?

డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో పూర్తీ విశ్లేషణ

Q : ‘CORONTINE’ పేరుతో మొబైల్ యాప్ ను అభివృద్ధి చేసింది ఎవరు,దాని వల్ల కలిగే ప్రయోజనాలు ?

కరోనావైరస్ వ్యాధి సోకి, దిగ్బంధనం నుండి తప్పించుకునే వ్యక్తులను గుర్తించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బొంబాయి CORONTINE అనే వేదికను నిర్మించింది.

ఫిబ్రవరి 2020 చివరి నుండి విదేశాలకు వెళ్ళిన వ్యక్తులకు జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి మరియు శ్వాస ఆడకపోవడం వంటి COVID-19 లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోటానికి కనీసం 14 రోజులు ఇంటి నిర్బంధాన్ని( quarantine) సూచించారు.

భారతదేశంలో COVID-19, +VE వ్యక్తులు quarantine నుండి తప్పించుకుని, సాధారణ ప్రజలతో కలిసిపోవటం వల్ల ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది.ఈ ప్రమాదాన్ని తగ్గించటానికి ఈ యాప్ ను రూపొందించారు

ఇన్స్టిట్యూట్ ఒక ప్రకటనలో, ఈ యాప్ ద్వారా అధికారులు వ్యాధి సోకిన వ్యక్తుల వివరాలు నమోదు చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది అని తెలిపింది .

ఐఐటి బొంబాయికి చెందిన ప్రొఫెసర్లు గణేష్ రామకృష్ణన్, మంజేష్ హనావాల్ నాయకత్వంలోని బృందం ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసారు.

ఈ యాప్ అనుమానాస్పద వ్యక్తి యొక్క మొబైల్ ఫోన్‌లో అధికారుల చేత ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత , అతను / ఆమె నియమించబడిన ఇంటిని వదిలి బయటకు వెళ్ళాలని ప్రయత్నిస్తే సంబంధిత అధికారులకు హెచ్చరికలు పంపబడతాయి .అప్పుడు అధికారులు ఈ వ్యక్తులను ట్రాక్ చేసి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.

అయితే ఈ యాప్ ఎలా పనిచేస్తుందో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా .అయితే కింది వీడియో చూడండి.

Leave a Reply